బీసీసీఐ నజరానా ద్రవిడ్ తిరస్కరణ
రూ. 2.5 కోట్లు వద్దన్న ది వాల్
ముంబై – ఒకటా రెండా ఏకంగా రూ. 2.5 కోట్లు ఎవరైనా ఇస్తామంటే వద్దంటారా. అవును నిన్నటి దాకా భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ తన పదవీ కాలం ముగిసింది. పోతూ పోతూ తను బిగ్ షాక్ ఇచ్చాడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు.
తన మార్గదర్శకత్వంలో రోహిత్ సేన టి20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. దీని వెనుక ద్రవిడ్ తపన, కృషి , ప్లాన్ ఉందనేది వాస్తవం. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు పీఎం మోడీ. ఇదిలా ఉండగా 17 ఏళ్ల తర్వాత 2011 తర్వాత టీమిండియా వరల్డ్ కప్ కైవసం చేసుకుంది.
దీనిని పురస్కరించుకుని ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన బీసీసీఐ కార్యదర్శి జే షా సంచలన ప్రకటన చేశాడు. జట్టుకు, కోచ్ కు, సహాయ సిబ్బందికి రూ. 125 కోట్లు నజరానా ప్రకటించారు. ఇందులో భాగంగా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కు రూ. 2.5 కోట్లు ప్రకటించింది. దీనిని వెళుతూ వెళుతూ తనకు వద్దంటూ తిరస్కరించాడు ది వాల్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పనికి దేశం యావత్తు విస్తు పోతోంది.
అయితే రాహుల్ ద్రవిడ్ తన సహాయక సిబ్బందితో సమానంగా ప్రైజ్ మనీని తీసుకుంటానని చెప్పాడని టాక్. మొత్తంగా ది వాల్ సెన్సేషన్ గా మారాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాడు.