వీల్ చైర్ లో మైదానంలో హెడ్ కోచ్
క్రికెట్ పట్ల నిబద్దత కలిగిన ఆటగాడిగా ఇప్పటికే గుర్తింపు పొందాడు భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. తన కాలికి గాయం అయ్యింది. అయినా తన నిబద్దతను చాటుకున్నాడు. వీల్ చైర్ లోనే మైదానంలోకి వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్లను అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. క్రికెట్ పట్ల తనకున్న పేషన్ ఏమిటో మరోసారి నిరూపించాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు, భవిష్యత్తులో రావాలని అనుకున్న వాళ్లు తనను స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఐపీఎల్ 2025లో భాగంగా గౌహతి లో జరిగిన లీగ్ మ్యాచ్ లో హోం గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ అత్యంత బాధ్యతా రాహిత్యంతో ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 రన్స్ చేసింది. ఇందులో ధ్రువ్ జురైల్ ఒక్కడే 33 రన్స్ చేశాడు. మిగతా వారంతా తమ వికెట్లను పారేసుకున్నారు. ఇదిలా ఉండగా రాహుల్ ద్రవిడ్ కు ఐపీఎల్ కంటే ముందు కాలికి గాయమైంది. కాలుకు బ్యాండేజ్ కట్టుకుని మైదానంలోకి వచ్చాడు. ఆయనను చూసిన వారంతా విస్మయానికి గురయ్యారు.
ఆట పట్ల తనకున్న ప్రేమ ఎలాంటిదో చెబుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది రాహుల్ ద్రవిడ్ ఫోటో. తను క్రచెస్ లేకుండా నడవలేడు. ఈ స్థితిలో కూడా జట్టు కోసం సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కు 2011 నుండి 2015 వరకు ఫ్రాంచైజీతో ఐదు సీజన్లు ఆడాడు రాహుల్ ద్రవిడ్. కెప్టెన్ నుంచి ప్రస్తుతం మెంటార్ గా ఉన్నాడు.