ది వాల్..రన్ మెషీన్ ఇక సెలవు
హెడ్ కోచ్ పదవీ కాలం ముగింపు
హైదరాబాద్ – భారత క్రికెట్ చరిత్రలో ఇద్దరు భారత దిగ్గజ ఆటగాళ్లు ఊహించని రీతిలో పదవీ విరమణ ప్రకటించడం విశేషం. ది వాల్ గా పేరు పొందిన రాహుల్ ద్రవిడ్ ఉన్నట్టుండి తన పదవీ కాలం ముగియడంతో ఇక సెలవంటూ ప్రకటించాడు. బ్రిడ్జి టౌన్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది టీమిండియా. 7 పరుగుల తేడాతో గెలుపొందింది.
రవి శాస్త్రి భారత జట్టుగా సేవలందించిన తర్వాత బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ ఉన్న సమయంలో పట్టుబట్టి భారత క్రికెట్ అకాడెమీ జట్టుకు చీఫ్ గా , మెంటార్ గా విశిష్ట సేవలు అందించాడు రాహుల్ ద్రవిడ్. తనకు ఇష్టం లేక పోయినా ఒత్తిడి చేసి మరీ రాహుల్ కు టీమిండియాకు హెడ్ కోచ్ గా నియమించాడు.
ఇదే సమయంలో భారత జట్టు ఎన్నో విజయాలను, అప జయాలను మూటగట్టుకుంది. ఈ తరుణంలో తన కోచ్ గా చిరస్మరణీయమైన రోజుగా మిగిలి పోతుంది. భారత జట్టుకు 17 ఏళ్ల తర్వాత తన మార్గదర్శకత్వంలో భారత్ 2024లో విశ్వ విజేతగా నిలిచింది.
ఇక రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టి20 ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. కోట్లాది మంది అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించాడు.