భారీ ఎత్తున హాజరైన జన సందోహం
ఉత్తర ప్రదేశ్ – పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా యూపీలో భారత కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ జన సంద్రాన్ని తలపింప చేసింది. ఎక్కడ చూసినా జనమే జనం ఇసుక వేస్తే రాలనంత ప్రజలు. అపూర్వమైన రీతిలో సాదర స్వాగతం పలికారు . ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
మండల్ వర్సెస్ కమండలం అన్నట్టుగా రాజకీయాలు శరవేగంగా మారి పోయాయి. ప్రస్తుతం అందరి కళ్లు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ పై ఉన్నాయి. వారిద్దరూ ఎక్కడికి వెళ్లినా జనం పరుగులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ జై అంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి.
ఈసారి గనుక మోదీ గెలిస్తే దేశాన్ని అమ్మేస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ జనాన్ని ఉద్దేశించి. పది ఏళ్ల పాటు పాలించిన ప్రధానమంత్రి ఈ దేశం కోసం ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు అఖిలేష్ యాదవ్ , రాహుల్ గాంధీ.