ప్రియాంక..రాహుల్ గాంధీ వైరల్
పార్లమెంట్ లో ప్రశ్నల వర్షం
ఢిల్లీ – అన్నా చెల్లెలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. వారు ఎవరో కాదు ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వైరల్ గా మారారు. గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఇద్దరు పాల్గొన్నారు. ఇదే సమయంలో ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన గౌతమ్ అదానీకి సంబంధించిన వ్యవహారంపై చర్చ జరగాలని పట్టు పట్టారు.
ఈసారి పార్లమెంట్ కు ప్రత్యేకత ఉంది. గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలుగా పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం. సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎంపీలుగా ఉన్నారు. ప్రధాన సమస్యలపై గొంతు విప్పే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో 4 లక్షల ఓట్లకు పైగా మెజారిటీ సాధించి గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. ఇది ఆ నియోజకవర్గ చరిత్రలో ఓ రికార్డ్. ఇదిలా ఉండగా అన్నా చెల్లెలుతో పాటు తల్లి కూడా కలిసి పార్లమెంట్ కు అటెండ్ కావడం చర్చకు దారి తీసేలా చేసింది.