NATIONAL

ఐదు గ్యారెంటీలు ప్ర‌క‌టించిన కాంగ్రెస్

Share it with your family & friends

యువ‌త‌కు పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు

మ‌ధ్య‌ప్ర‌దేశ్ – దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లకు సిద్ద‌మ‌య్యాయి రాజ‌కీయ పార్టీలు. ఈ త‌రుణంలో దేశం కోసం ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ భార‌త్ జోడో న్యాయ్ యాత్ర చేప‌ట్టారు. ఇందులో భాగంగా బాన్స్వారా బహిరంగ సభలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. యువతకు న్యాయం చేకూర్చడానికి, వారి భవితకు మార్గం చూపడానికి ఐదు గారంటీలను ప్రకటించారు:

భ‌ర్తీ భ‌రోసాను వెల్ల‌డించారు. ఇందుల జాబ్ కేలండర్ ద్వారా కేంద్రంలో అధికారంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు. పక్కాగా మొదటి ఉద్యోగం కింద‌ సరికొత్త అప్రెంటిస్ హక్కు చట్టం ద్వారా, 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ప్రతి డిప్లొమా హోల్డర్ లేక కాలేజీ గ్రాడ్యుయేట్లకు, ప్రైవేట్ లేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏడాది పాటు అప్రెంటిస్షిప్, నెలకు రూ 8500 చొప్పున ఏడాదికి రూ లక్ష సహాయం చేస్తామ‌న్నారు.

పేపర్ లీక్ నుండి విముక్తి క‌ల్పిస్తామ‌న్నారు. అత్యంత కట్టు దిట్టమైన భద్రత, నిజాయితీ ,న్యాయ బద్ధమైన పద్ధతుల్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడేలా కాంగ్రెస్ కఠినమైన కొత్త చట్టాలు తీసుకు వస్తుందని ప్ర‌క‌టించారు. దీని ద్వారా పేపర్ లీకేజీలతో కోట్లమంది విద్యార్థుల బతుకులు బలికాకుండా కాపాడతామ‌న్నారు.

గిగ్ ఎకానమీలో సామాజిక భద్రత క‌ల్పిస్తామ‌ని చెప్పారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ తీసుకువచ్చే కొత్త చట్టాలు, శాసనాల ద్వారా గిగ్ ఎకానమిలో పనిచేస్తున్నలక్షలాది యువకులకు, పనిచేసే చోట మెరుగైన పరిస్థితులు, సామాజిక భద్రత కల్పిస్తుందన్నారు.

యువ ప్రకాశం ప‌థ‌కం కింద‌ కాంగ్రెస్ నెలకొల్పే రూ 5000 కోట్ల కార్పస్ ఫండ్ ద్వారా ఐదు సంవత్సరాలకు గాను, దేశంలోని అన్ని జిల్లాల్లో కేటాయింపులు. దీని ద్వారా 40 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు, ఏ రంగంలోనైనా వారి స్టార్ట్ అప్ వ్యాపారాలకు ఫండింగ్ సాధించుకునే అవకాశం క‌ల్పిస్తామ‌న్నారు.