అస్సాం పరిస్థితిపై రాహుల్ ఆందోళన
సహాయక చర్యలు చేపట్టాలి
రాజస్తాన్ – లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసోంలో వరదల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. నా ఆలోచనలు ప్రళయంలో కొట్టుమిట్టాడుతున్న మా సోదరులు, సోదరీమణులతో ఉన్నాయని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెస్క్యూ, పునరావాస కార్యకలాపాలలో సహాయం అందించాలని కాంగ్రెస్ నాయకులకు , కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీ.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సానుభూతితో , త్వరితగతిన బాధితులకు సాధ్యమైనంత మేర సహాయ సహకారాలు అందించాలని కోరారు. బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు. ఇదిలా ఉండగా రాజస్థాన్ లో నిర్వహించిన సమావేశంలో భారీ ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్బంగా అయోధ్యలో ఎందుకు భారతీయ జనతా పార్టీ ఓడి పోయిందో కూలంకుశంగా వివరించారు రాహుల్ గాంధీ. ఎంత కాలం ఇలా కులం పేరుతో, మతం పేరుతో రాజకీయలు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇకనైనా మోడీ తన వైఖరి మార్చు కోవాలని సూచించారు.