యువతకు భరోసా ఉద్యోగాల ఆసరా
30 లక్షల జాబ్స్ ఇస్తామన్న రాహుల్
పంజాబ్ – కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారలో భాగంగా ఆయన పంజాబ్ లోని షాహీద్ భగత్ సింగ్ నగర్ లో జరిగిన సభలో ప్రసంగించారు. ఇవాల్టితో ఎన్నికల ప్రచారం ముగిసింది.
తాము అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తాము కొలువు తీరిన వెంటనే 30 లక్షల జాబ్స్ ను భర్తీ చేస్తామని ప్రకటించారు. దేశంలో 70 కోట్ల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువలకు జాబ్స్ ఇవ్వలేని పక్షంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతిని ఇస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. జాబ్స్ పొందడం అనేది ప్రతి ఒక్కరి హక్కు అని స్పష్టం చేశారు. నెలకు రూ. 8,500 , సంవత్సరానికి లక్ష ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
అదానీ, అంబానీలకు మద్దతు ఇస్తే వాళ్లు జాబ్స్ ఇస్తారంటూ ప్రధాన మంత్రి మోడీ చెబుతున్నారని , ఇది అత్యంత దారుణమైన విసయమని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.