Thursday, June 19, 2025
HomeOTHERSEDITOR'S CHOICEజీతే ర‌హో రాహుల్ గాంధీజీ

జీతే ర‌హో రాహుల్ గాంధీజీ

జూన్ 19న పుట్టిన రోజు శుభ‌కాంక్ష‌లు

అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టిన రోజు ఇవాళ‌. ఘ‌న‌మైన రాజ‌కీయ వార‌స‌త్వం క‌లిగిన చ‌రిత్ర త‌న‌ది. కేంబ్రిడ్జి యూనివ‌ర్శిటీలో చ‌దువుకున్నాడు. పొలిటిక‌ల్ లీడ‌ర్ గా త‌న‌ను తాను నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. జూన్ 19, 1970లో పుట్టాడు. త‌న‌కు 56 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. త‌న‌పై ఎన్ని ట్రోల్స్ చేసినా న‌వ్వుకుంటూ వెళ్ల‌డం అల‌వాటుగా చేసుకున్నాడు. కాషాయ ప‌రివారం త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, ఛీత్కారాలు , మీమ్స్ చేసినా ప‌ట్టించుకోకుండా త‌నప‌ని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇది త‌న ప్ర‌త్యేక‌త‌. కాంగ్రెస్ పార్టీకి త‌ను చోద‌క‌శ‌క్తిగా ఉన్నా ఎందుక‌నో ఆ పార్టీ ఇంకా ఇబ్బందులు ప‌డుతూనే ఉంది.

మ‌రో వైపు బ‌లీయ‌మైన శ‌క్తిగా అవ‌త‌రించింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకుంటున్న న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీతో ధైర్యంగా ఢీకొనే లీడ‌ర్ గా పేరు పొందాడు రాహుల్ గాంధీ. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌త్య‌ర్థులను భ‌య పెట్టేలా చేసింది. ఎన్నో స‌మ‌స్య‌ల గురించి నిల‌దీశాడు. ప్ర‌జ‌ల త‌ర‌పున త‌న గొంతు వినిపించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు రాహుల్ గాంధీ. పార్ల‌మెంట్ సాక్షిగా ఈ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం గురించి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చెప్పాడు.

ఏఐసీసీ మాజీ చీఫ్ గా ఉన్న రాహుల్ గాంధీ భార‌త యువ‌జ‌న కాంగ్రెస్, భార‌త జాతీయ విద్యార్థి యూనియ‌న్ ల‌కు చైర్ ప‌ర్స‌న్ గా ఉన్నారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కూడా ప‌ని చేశాడు. ప్ర‌స్తుతం లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. లండ‌న్ లో చ‌దువు పూర్త‌య్యాక మానిటర్ గ్రూప్ అనే మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు. 2014 భారత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సారథ్యం వహించారు. ఈ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. చరిత్రలో ఎన్నడూలేని వైఫల్యాన్ని చవి చూసింది. ఆ త‌ర్వాత పుంజుకున్నా ప‌వ‌ర్ లోకి రాలేక పోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments