NEWSNATIONAL

అంద‌రి క‌ళ్లు అత‌డి పైనే

Share it with your family & friends

రాహుల్ అరుదైన నేత
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా 143 కోట్ల మంది భార‌తీయులు ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు . దీనికి కారణం అస‌లైన పండ‌గ వ‌చ్చేసింది. ఎవ‌రు గెలుస్తారు..ఏయే పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నేది చ‌ర్చోప చ‌ర్చ‌ల‌లో మునిగి పోయారు.

దేశంలో 17వ విడ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిశాయి. పోలింగ్ కూడా పూర్త‌యింది. అక్క‌డ‌క్క‌డా చెదురు మ‌దురు సంఘ‌ట‌న‌లు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రిగింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం 75 ఏళ్ల స్వ‌తంత్రం వ‌చ్చిన త‌ర్వాత తొలిసారిగా ఏడు విడ‌త‌లుగా ఎన్నిక‌లు చేప‌ట్టింది.

ఈ సంద‌ర్బంగా ఈసారి ఎన్నిక‌లు మోడీ వ‌ర్సెస్ రాహుల్ , దేశ ప్ర‌జ‌ల మ‌ధ్య పోటీ గా మారి పోవ‌డం విస్తు పోయేలా చేసింది. గ‌త కొంత కాలంగా రాహుల్ గాంధీ చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌జాద‌ర‌ణ‌లో ముందుకు వ‌చ్చారు.

భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. తొలి విడ‌త స‌క్సెస్ అయ్యింది. రెండో విడ‌త చేప‌ట్టిన యాత్ర‌కు భారీ ఎత్తున జ‌నాద‌ర‌ణ ల‌భించింది. మొత్తంగా అంద‌రి కళ్లు ఈ యువ నాయ‌కుడిపైనే ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు.