అవార్డు గ్రహీతలకు అభినందనలు
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా భారతీయ తారలను అభినందనలతో ముంచెత్తారు. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ తారలు మెరిశారు. ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రిక్స్ పురస్కారాన్ని దక్కించుకున్నారు.
దీంతో భారత దేశానికి పేరు తీసుకు వచ్చేలా చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ పేరు పేరునా అభినందనలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇదిలా ఉండగా ఈ 77వ కేన్స్ పండుగలో పాయల్ కపాడియా, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ బృందం మొత్తానికి కంగ్రాట్స్ తెలిపారు.
ఇదిలా ఉండగా ది షేమ్ లెస్ మూవీలో తన నటనకు గాను ఆన్ సెర్లైన్ రిగార్డ్ విభాగం కింద ఉత్తమ నటి అవార్డును పొందారు అనసూయ సేన్ గుప్తా. వీరంతా మహిళలు కావడం విశేషం. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీరంతా మహిళలకు , ఈ దేశానికి స్పూర్తి దాయకంగా మారారని కొనియాడారు. ఒక రకంగా అరుదైన ఘనత సాధించారు. చరిత్రకు నాంది పలికారంటూ పేర్కొన్నారు. మొత్తంగా భారతీయ చలన చిత్ర రంగానికి స్పూర్తి కలిగించారంటూ తెలిపారు రాహుల్ గాంధీ.