NEWSNATIONAL

గౌత‌మ్ అదానీని త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాలి

Share it with your family & friends

డిమాండ్ చేసిన ఎంపీ రాహుల్ గాంధీ

ఢిల్లీ – రాయ్ బ‌రేలీ ఎంపీ రాహుల్ గాంధీ గౌత‌మ్ అదానీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వెంట‌నే ఆయ‌న‌ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. గురువారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అరెస్ట్ కాకుండా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అడ్డు ప‌డుతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

2020 నుంచి 2024 మధ్య రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు $250 మిలియన్లకు పైగా లంచాలు చెల్లించినట్లు యుఎస్ ప్రాసిక్యూటర్లు గౌతమ్ అదానీ తో పాటు ఇతరులపై అభియోగాలు మోపారు. అదానీ అమెరికన్భా, రతీయ చట్టాలను ఉల్లంఘించారని తేలి పోయింద‌న్నారు. ఇది తాను చెప్ప‌డం లేద‌ని అమెరికా తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింద‌న్నారు.

ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా వెల్ల‌డించింద‌ని, ఇక ఎందుకు ఆల‌స్యం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ. ఇంత‌గా అభియోగాలు మోపినా ఇంకా స్వేచ్ఛ‌గా దేశంలో అదానీ తిరుగుతున్నారంటే ఆశ్చ‌ర్యం వేస్తోంద‌న్నారు రాహుల్ గాంధీ.

గ‌తంలో సీఎంల‌ను అరెస్ట్ చేశారు. త‌మ పార్టీకి చెందిన వారిపై కేసులు న‌మోదు చేశారు. కానీ అదానీ రూ. 2,000 కోట్ల స్కాం కు పాల్ప‌డినా ఎందుకు అదుపులోకి తీసుకోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు . ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఒక నెట్‌వర్క్ భారతదేశాన్ని హైజాక్ చేసిందన్నారు.

సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్ మధబి పూరీ బుచ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై విచారణ జరగాలని, అయితే విచారణ అదానీతో ప్రారంభం కావాలని ఆయన అన్నారు.