నీట్ ను రద్దు చేయాలి – రాహుల్
ప్రధాని మోడీపై సీరియస్ కామెంట్స్
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ 2024 పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. మోడీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు. మొత్తం పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరారు.
శనివారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది నీట్ పరీక్షకు ఏకంగా 25 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారని, వారి భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో నిండి పోయిందన్నారు రాహుల్ గాంధీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సోయి లేకుండా పోయిందన్నారు.
తన వ్యక్తిగత ప్రచారం తప్పితే దేశంలో చోటు చేసుకున్న సమస్యలపై దృష్టి సారించక పోవడం దారుణమన్నారు. ఓ వైపు నీట్ లో స్కామ్ కు ఎవరు బాధ్యులనే దానిపై విచారణ జరిపించాలని, యూజీసీ నెట్ పై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలతో వెంటనే శోధాలు జరిపించేలా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు తాము పోరాడుతామని ప్రకటించారు.