రేవణ్ణ కేసులో మోదీ క్షమాపణ చెప్పాలి
స్పష్టం చేసిన ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్
కర్ణాటక – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతి పరులు, అక్రమార్కులకే కాకుండా మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేసిన వారికి కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు ప్రధానిగా ఈ దేశానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కర్ణాటకలోని శివ మొగ్గలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి ఎమ్మెల్యే రేవణ్ణ ఇద్దరూ లైంగింక వేధింపులు, అశ్లీల వీడియోలు తీసిన కేసులో ఇరుక్కున్నారని అన్నారు. ఈ కేసు విషయంపై ఇప్పటికే తమ ప్రభుత్వం పూర్తిగా క్లారిటీ ఇచ్చిందని చెప్పారు.
ఎవరి ప్రలోభాలకు తలొగ్గకుండా సిట్ కు ఆదేశించిందని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు. 400 మంది మహిళలపై సామూహిక అత్యాచారం చేసిన వ్యక్తి రేవణ్ణ అని, పోలీసులు ఈ విషయాన్ని ప్రకటించారని తెలిపారు. నిస్సిగ్గుగా రేవణ్ణకు మోదీ ఎలా మద్దతు ఇస్తారంటూ నిలదీశారు.