NEWSNATIONAL

రైలు ప్ర‌మాదంపై రాహుల్ దిగ్భ్రాంతి

Share it with your family & friends

మృతుల కుటుంబాల‌కు సంతాపం
ఢిల్లీ – ఏఐసీసీ సీనియ‌ర్ నేత‌, రాయ్ బ‌రేలి ఎంపీ రాహుల్ గాంధీ రైలు ప్రమాదం ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. బాధ‌ను వ్య‌క్తం చేశారు. గ‌త కొంత కాలంగా రైలు ప్ర‌మాదాలు దేశంలో స‌ర్వ సాధార‌ణంగా మారి పోయాయ‌ని, ఇది అత్యంత గ‌ర్హ‌నీయ‌మ‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

తాజాగా మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం బాలాసోర్ ప్రమాదానికి అద్దం పడుతుందని అన్నారు. ప్యాసింజ‌ర్ రైలు నిలిచి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్ట‌డం బాధ్య‌తా రాహిత్యాన్ని సూచిస్తుంద‌ని పేర్కొన్నారు. ఇది బాధాక‌రం.

అనేక ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, గుణ పాఠాలు నేర్చుకోలేదు. జవాబుదారీతనం లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ ప్రభుత్వం మేల్కోక ముందే ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలని ప్ర‌శ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు .

ఇది పూర్తిగా కేంద్ర స‌ర్కార్ వైఫ‌ల్య‌మ‌ని ఆరోపించారు రాయ్ బ‌రేలి ఎంపీ. దీనిని పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఏది ఏమైనా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.