ఆదివాసీలకు కాంగ్రెస్ భరోసా
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
మహారాష్ట్ర – ఈ దేశంలో తర తరాల నుంచి మోసానికి గురవుతూ వస్తున్న ఆదివాసీలను ఆదుకునేందుకు తమ పార్టీ స్పష్టమైన హామీ ఇస్తుందని అన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లో జరిగిన ఆదివాసీ న్యాయ సమ్మేళన్‌లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ దేశాభివృద్దిలో కీలకమైన భాగస్వామ్యం కలిగి ఉన్నారంటూ ఆదివాసీలను ఉద్దేశించి స్పస్టం చేశారు.
ఆదివాసీలకు పూర్తి భద్రత కల్పిస్తామని, వారిని తమ కాళ్ల మీద నిలబడేందుకు తాను ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఆదివాసీల పెండింగ్‌లో ఉన్న అన్ని ఎఫ్ఆర్ఏ క్లెయిమ్ లను ఒక సంవత్సరం లోగా పరిష్కరిస్తామని చెప్పారు రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపు ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకుంటామన్నారు.
ఆదివాసీలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ వచ్చిన అటవీ సంరక్షణ, భూ సేకరణ చట్టాలకు మోడీ సర్కార్ చేసిన అన్ని సవరణలను రద్దు చేస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ.