NEWSNATIONAL

డిప్యూటీ స్పీక‌ర్ ఇస్తే మ‌ద్ద‌తు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ – లోక్ స‌భ స్పీక‌ర్ ఎవ‌రు అవుతార‌నే దానిపై ఉత్కంఠ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం మ‌రోసారి ప్ర‌స్తుతం స్పీక‌ర్ గా ఉన్న ఓం బిర్లానే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మి. త‌మ‌కు ముందు నుంచి స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వాల‌ని ప‌ట్టు ప‌డుతూ వ‌చ్చింది.

అయితే సంఖ్యా బ‌లం కొద్దిగా ఎక్కువ‌గా ఉండ‌డంతో స్పీక‌ర్ ప‌ద‌విని త‌మ‌కే వ‌దిలి వేయాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షా. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి గా ఉన్న కిరెన్ రిజిజు శ‌త విధాలుగా మంత‌నాలు కొన‌సాగిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో రంగంలోకి దిగారు కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ . ఆయ‌న కూడా ప్ర‌తిప‌క్షాల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌మ కూట‌మికి డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి అప్ప‌గిస్తే తాము బేష‌ర‌తుగా స్పీక‌ర్ ప‌ద‌వికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.