బడ్జెట్ తయారీలో ఇద్దరికే ఛాన్స్
ఒకరు మైనారిటీ..మరొకరు ఓబీసీ
ఢిల్లీ – లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడు , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సమావేశాలలో భాగంగా సోమవారం సంచలన కామెంట్స్ చేశారు. మోడీ ప్రభుత్వం పనిగట్టుకుని వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇందుకు ఉదాహరణగా తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ 2024 గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
బడ్జెట్ తయారీలో మొత్తం 20 మంది ఉన్నతాధికారులు పాలు పంచుకున్నారని, ఇందులో కేవలం ఇద్దరు బడుగులకు మాత్రమే చోటు కల్పించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరు మైనార్టీ వర్గానికి చెందిన అధికారి కాగా మరొకరు ఓబీసీకి చెందిన అధికారి ఉన్నారంటూ పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
ఈ బడ్జెట్ దేశ ప్రజల గురించి ప్రవేశ పెట్టలేదని, కేవలం కొంత మంది పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేందుకే తయారు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. దేశం అంటే కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే కాదన్నారు. దేశమంటే అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉంటారని గుర్తు పెట్టుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ.