ద్వేషం వద్దు ప్రేమ కావాలి
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – మోదీ నియంతృత్వ ధోరణి కారణంగా భారత దేశం మరింత వెనక్కి వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. ప్రధానంగా తమిళనాడులో పర్యటించిన ఆయన నెట్టింట్లో వైరల్ గా మారారు. కోయంబత్తూరులో సీఎం ఎంకే స్టాలిన్ తో కలిసి ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుల, మతతత్వ రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎండ గడుతూ వస్తున్నారు. ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ ఏదైనా ఉందంటే అది కాషాయ పార్టీ తప్పా మరోటి కాదన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారంటూ మోదీపై ధ్వజమెత్తారు. ఇదే సమయంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలోకి నెట్టి వేయబడిందన్నారు. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేని రీతిలో దాదాపు 15 లక్షల మందికి పైగా జనం స్వచ్చంధంగా హాజరయ్యారు సభకు. మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు రాహుల్ గాంధీ. ఈ దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలన్నారు.