జమ్మూ కాశ్మీర్ ప్రజలతో ప్రత్యేక బంధం
మీతో అనుబంధం గొప్పదన్న రాహుల్
శ్రీనగర్ – లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి ఈ సందర్బంగా గురువారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
జమ్మూ కాశ్మీర్ ప్రజలను తాను మరిచి పోలేనని అన్నారు. ఇక్కడి ప్రాంతంతో తనకు ఎనలేని బంధం ఉందన్నారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వమైన రీతిలో ఆదరణ లభించిందని చెప్పారు. మీరు చూపించిన ప్రేమ ఇప్పటికీ తనకు గుర్తు ఉంటుందన్నారు రాహుల్ గాంధీ.
జమ్మూ కాశ్మీర్ ప్రజలను తాను ప్రేమిస్తూనే ఉంటానని చెప్పారు. మీ అభిమానం తనను ఆశ్చర్య పోయేలా చేసిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే తమపై ఉండాలని కోరారు రాయ్ బరేలీ ఎంపీ. ఈ బంధం ఇప్పటిది కాదన్నారు.
పాత కాలం నాటి నుంచి ఉందన్నారు. తన తండ్రి, తన తాత, నాయనమ్మల కాలం నాటి నుంచి జమ్మూ కాశ్మీర్ తో తమ కుటుంబానికి ప్రత్యేకమైన బంధం నెలకొని ఉందన్నారు రాహుల్ గాంధీ.
ఎన్నో ఒత్తిళ్లు, ఒడిదుడుకుల మధ్య తాను యాత్ర చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో తాము మరో పార్టితో పొత్తు పెట్టుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు దీనిని గమనించి కలిసి ముందుకు సాగాలని సూచించారు.