త్వరలోనే పెళ్లి చేసుకుంటా
వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత కొంత కాలంగా పెళ్లి అనే సరికల్లా దాట వేస్తూ వస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ముందు వివాహం గురించి ఆరా తీస్తున్నారు. దీంతో ఇదే అతి పెద్ద సమస్యగా మారిందంటూ ఒకానొక సమయంలో జోక్ కూడా వేశారు.
తాజాగా రాయ్ బరేలిలో జరిగిన ఓ సమావేశంలో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడున్న జనం హర్షాతిరేకలు వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా గత ఏడాది నుంచి రాహుల్ గాంధీ కీలకమైన నాయకుడిగా ఎదిగారు. ఒకానొక సమయంలో ఆయనను పప్పు అని అన్న వారే ఇప్పుడు పవర్ ఫుల్ లీడర్ అనేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
ప్రధానంగా నరేంద్ర మోదీని ఎదుర్కోవడంలో సత్తా చాటారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ జనం గొంతుకగా మారారు. దీంతో రాహుల్ బెటర్ అన్న అభిప్రాయం అంతటా వ్యక్తం అవుతోంది.