మోదీకి ఓటమి భయం
రాహుల్ గాంధీ కామెంట్స్
న్యూఢిల్లీ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి, మోదీకి ఎదురు గాలి వీస్తోందని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జాతిని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా వీడియో సందేశం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సంచలనం రేపుతోంది.
ఇంకెంత కాలం 143 కోట్ల మంది ప్రజలను మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసి ఓట్లను దండు కోవాలనే మీ ప్రయత్నం ఇక చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. జనం మార్పు కోరుకుంటున్నారని, మీరు చేస్తున్న దారుణమైన దగా గురించి వారందరికీ తెలిసి పోయిందన్నారు రాహుల్ గాంధీ.
మోదీకి చెందిన దోస్తులు అదానీ, అంబానీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడి చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఆరు నూరైనా అధికారం కంటే ఈ దేశం కోసం, ప్రజలంతా సోదర భావంతో మెలిగేందు కోసం తాను ప్రశ్నిస్తూనే ఉంటానని పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్ర నేత. ఏది ఏమైనా మోదీకి ఓటమి భయం పట్టుకుందన్నారు.