విద్య తోనే వికాసం – రాహుల్
నవోదయ వ్యవస్థాపక దినోత్సవం
న్యూఢిల్లీ – విద్య తోనే వికాసం అలవడుతుందని తద్వారా దేశానికి మేలు జరుగుతుందని అన్నారు రాహుల్ గాంధీ. శనివారం దేశ వ్యాప్తంగా నవోదయ వ్యవస్థాక దినోత్సవాన్ని జరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆనాటి దివంగత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో విద్యా ప్రాధాన్యతను గుర్తించి నవోదయ విద్యాలయ సమితులను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు రాహుల్ గాంధీ.
ఈ సందర్బంగా ఇవాళ నవోదయ విద్యాలయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాందీ. దేశంలోని పేద, అణగారిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. రాజీవ్ గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలలో ఇది కూడా ఒకటి అని స్పష్టం చేశారు.
నవోదయ విద్యాలయ సమితి అనేది గ్రామీణ భారతదేశంలోని పిల్లల కలలకు రెక్కలు తొడిగిలే చేసిందన్నారు రాహుల్ గాంధీ. విద్య ద్వారానే గుర్తింపు లభిస్తుందని, దాని ద్వారానే గౌరవం ఏర్పడుతుందన్నారు.
ఇదే సమయంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించే పనిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో రాజకీయం చేయడం తప్పితే పీఎం దేశానికి చేసింది ఏమీ లేదన్నారు.