NEWSANDHRA PRADESH

నా సోద‌రి ష‌ర్మిల‌ను గెలిపించండి

Share it with your family & friends

పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ

క‌డ‌ప జిల్లా – నా చెల్లెలు ష‌ర్మిల‌ను గెలిపించాల‌ని పిలుపునిచ్చారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శ‌నివారం క‌డ‌పలో జరిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న తండ్రికి సోద‌రుడ‌ని అన్నారు. ఆయ‌న లేని లోటు తీర్చ‌లేనిద‌ని పేర్కొన్నారు.

త‌న సోద‌రి ఇవాళ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచింద‌ని మీ ఆశీర్వాదం ఆమెకు ఉండాల‌ని కోరారు. త‌ప్ప‌కుండా ష‌ర్మిల‌ను గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. ఆమె గెలుపు మీ అంద‌రికీ మేలు చేకూర్చేలా చేస్తుంద‌ని చెప్పారు. పార్ల‌మెంట్ కు పంపించాల్సిన బాధ్య‌త మీ అంద‌రిపై ఉంద‌న్నారు.

అనంత‌రం ఎన్నిక‌లలో పోటీ చేస్తున్న వైఎస్ ష‌ర్మిలా రెడ్డి మాట్లాడుతూ త‌న తండ్రిని ఆద‌రించిన‌ట్లే త‌న‌ను కూడా అక్కున చేర్చుకోవాల‌ని కోరారు. మీ రుణం తీర్చుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. ఈ ఒక్క‌సారి త‌నకు ఓటు వేసి గెలిపించాల‌ని , మీతోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ పీసీసీ చీఫ్‌.