మహిళలను మహరాణుల్ని చేస్తాం
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
ఆదిలాబాద్ జిల్లా – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ మహిళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
మహిళలు లేక పోతే అభివృద్ది అన్నది ఉండదన్నారు. తాము చెప్పినట్టుగానే అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అబద్దాలంటూ మండిపడ్డారు.
గత ఎన్నికల సందర్బంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించామని, ఇప్పటికే 5 అమలులో ఉన్నాయని చెప్పారు. ఇక తాము పవర్ లోకి వస్తే తెలంగాణలోని మహిళలకు ఏడాదికి లక్షా 30 వేల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా కేంద్రం నుండి రూ. లక్ష , రాష్ట్రం వాటా నుండి రూ. 30 వేలు అందుతాయని తెలిపారు.
కుల గణన తర్వాత దేశంలో , తెలంగాణలో పాలన భిన్నంగా ఉంటుందన్నారు. తమ సర్కార్ వచ్చాక రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతామని చెప్పారు రాహుల్ గాంధీ. ప్రైవేటీకరణకు మోదీ ప్రయారిటీ ఇస్తున్నాడని ఆరోపించారు. ఆయనకు మూడిందన్నారు.