NEWSNATIONAL

మేనిఫెస్టోపై రాహుల్ ముద్ర

Share it with your family & friends

ఏఐసీసీ కీల‌క సమావేశానికి హాజ‌రు

న్యూఢిల్లీ – పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈసారి జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌రే స‌త్తా చాటాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. ఇందులో భాగంగా భావ సారూప్య‌త క‌లిగిన పార్టీల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ఇదే స‌మ‌యంలో ఇండియా కూట‌మిలో కీల‌క‌మైన భూమిక పోషిస్తోంది.

మ‌రో వైపు క‌ర్ణాట‌క‌కు చెందిన ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను ఏరికోరి మాజీ చీఫ్ సోనియా గాంధీ ఎంపిక‌య్యేలా చేసింది. ఇదే స‌మ‌యంలో పార్టీ మ‌రింత దూకుడు పెంచింది. అంప‌శయ్య‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఆయ‌న అనూహ్యంగా గ‌త ఏడాది 2023లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. ఇది బిగ్ స‌క్సెస్ అయ్యింది.

ఇదే స‌మ‌యంలో దానికి కొన‌సాగింపుగా ఈ ఏడాది 2024లో భార‌త్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రెండో విడ‌త పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇది కూడా విజ‌య‌వంత‌మైంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టు కోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు రాహుల్ గాంధీ.

ఇదే స‌మ‌యంలో త‌న యాత్ర ద్వారా ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విన‌త‌లు, స‌మ‌స్య‌ల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని కాంగ్రెస్ పార్టీ అంద‌రికీ మేలు చేకూర్చేలా మేనిఫెస్టోను త‌యారు చేసింది. ఇది బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చేలా చేస్తుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.