అందరి కళ్లు రాహుల్ పైనే
ఇండియా కూటమి ముందంజ
న్యూఢిల్లీ – 17వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్న వేళ అందరి కళ్లు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై ఉన్నాయి. ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి ఊహించని రీతిలో ఫలితాలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే పదే ప్రకటించిన 400 సీట్లు రావడం లేదు. ప్రస్తుతానికి బీజేపీ కేవలం 230 సీట్లకు పరిమితం కాగా ఇం డియా కూటమి 261కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండడం విశేషం.
దీంతో మోడీ పాలన పట్ల దేశంలో ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈ ఫలితాలు ప్రస్పుటం చేస్తున్నాయి. యూపీలో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగులుతోంది. విచిత్రం ఏమిటంటే ప్రధాన నేతలంతా వెనుకంజలో ఉండడం విస్తు పోయేలా చేసింది బీజేపీ శ్రేణులను.
కులం పేరుతో, మతం పేరుతో విద్వేషాలను రెచ్చ గొడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఓట్లను రాబట్టు కోవాలనే ఉద్దేశంతో నడిపిన చిల్లర రాజకీయాలను ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకించారు. మొత్తంగా ఎవరు ప్రధానమంత్రి అవుతారనే దానిపై చర్చ కొనసాగుతోంది.