ఎంపీ రాహుల్ మణిపూర్ పర్యటన
రేపు రాయ్ బరేరిలో ఎంపీ టూర్
న్యూఢిల్లీ – కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం న్యూఢిల్లీ నుంచి మణిపూర్ కు బయలు దేరి వెళ్లారు. ఆయన మరోసారి మణిపూర్ ను సందర్శించనున్నారు. గతంలో సార్వత్రిక ఎన్నికల కంటే ముందు పలుమార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
ఎన్నికల అనంతరం కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఊహించని రీతిలో ప్రతిఫక్షాలతో కూడిన ఇండియా కూటమి భారీ ఎత్తున సీట్లను కైవసం చేసుకుంది. ఇవాళ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. అన్ని పక్షాల నుంచి రాహుల్ గాంధీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
ప్రధానంగా గత ఏడాది నుంచి నేటి దాకా మణిపూర్ తీవ్రమైన వివక్షకు లోనవుతోంది. హింస ఊహించని స్థాయిలో చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ఇండియా కూటమి మణిపూర్ లో చోటు చేసుకున్న ఘటనలపై చర్చించాలని పట్టు పట్టింది. దీనికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు.