సమస్యలు పరిష్కరించాలని విన్నపం
మణిపూర్ – లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు. ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా అల్లకల్లోలంగా మారిన మణిపూర్ రాష్ట్రాన్ని పర్యటించారు. ఈ సంరద్బంగా బాధితులను పరామర్శించారు. వారికి తాను ఉన్నానంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తాను సమస్యలు ఏమున్నాయనే దానిపై తెలుసుకునేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చానని చెప్పారు.
లేనిపోని సమస్యలను ముందుకు తెస్తూ అసలైన సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని, ఇదే సమయంలో తలతిక్క ప్రశ్నలు వేయొద్దని ఆయన సుతిమెత్తగా సూచించారు మీడియాకు. గత కొంత కాలం నుంచీ మీడియా గంప గుత్తగా రాహుల్ గాంధీని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు.
కానీ సీన్ మారింది. చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్న చందంగా బీజేపీకి ఆశించిన మెజారిటీ రాలేదు. దీంతో సంకీర్ణంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ అత్యంత పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. ఇదే సమయంలో మణిపూర్ లో లా అండర్ సరిగా ఉండేలా చూడాలని, బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఈ మేరకు రాజ్ భవన్ లో ఉన్న గవర్నర్ ను కలిశారు. వినతి పత్రం అందజేశారు రాహుల్ గాంధీ.