రాహుల్ గాంధీ వైరల్
సామాన్యుడి లాగే బార్బర్ షాపులో
ఉత్తరప్రదేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ చర్చనీయాంశంగా మారారు. తాను కూడా సామాన్యుడినేనంటూ చెప్పకనే చెబుతున్నారు. గత కొంత కాలం నుంచి ఆయన ప్రజల మధ్యనే ఉండేందుకు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు.
ప్రధానంగా దేశంలో సామాన్యులు, పేదలు, బడుగు, బలహీన వర్గాలు, నిరుద్యోగులు, నైపుణ్యం కలిగిన యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తన వైపు తిప్పుకునేలా చేస్తున్నారు.
తాజాగా ఆయన ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను వాయనాడుతో పాటు యూపీలోని రాయ్ బరేలి నుంచి కూడా ఎంపీగా పోటీలో నిలిచారు. ఈ సందర్బంగా ఈ లోక్ సభ నియోజకవర్గంలో ప్రజలను ప్రత్యేకంగా కలుస్తూ వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఓ యువకుడు నడిపిస్తున్న బార్బర్ షాప్ వద్దకు వెళ్లారు. తను గడ్డం గీయించుకున్నారు. ఇదే సమయంలో తనకు ఉన్న స్కిల్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు రాహుల్ గాంధీ. యువత పనిపై ఫోకస్ పెడితే అద్భుతాలు చేయొచ్చని ఈ సందర్బంగా పేర్కొన్నారు .