కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్లకు సలాం
మీ సేవలు ప్రశంసనీయమన్న రాహుల్
న్యూఢిల్లీ – లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన వాయనాడు ప్రాంతంలో చోటు చేసుకున్న కొండ చరియలు విరిగి పడిగిన దుర్ఘటనలో ఇప్పటి వరకు 278 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇటీవలే రాహుల్ గాంధీతో పాటు సోదరి ప్రియాంక గాంధీ కూడా వాయనాడును సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య తమ ప్రాణాలను పణంగా పెట్టి కష్టతరమైన భూభాగాల గుండా ప్రయాణించి, ఆపదలో ఉన్న కుటుంబాన్ని విజయవంతంగా రక్షించేందుకు అవిశ్రాంతంగా 8 గంటల ఆపరేషన్‌ను చేపట్టిన కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిచేశారు రాహుల్ గాంధీ.
ఆర్మీ సిబ్బందికి, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, వాయనాడ్‌లోని జిల్లా యంత్రాంగం, పంచాయతీ సభ్యులకు, పార్టీలకు అతీతంగా కార్యకర్తలకు, సహాయ, సహాయ, పునరావాస ప్రయత్నాలలో నిరంతరం సహాయం చేస్తున్న ప్రతి ఉదార స్వచ్చంద సేవకులకు కూడా తాను కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్లిష్ట సమయాల్లో, మీ నిస్వార్థ సేవ, నిబద్ధత , ఐక్యత ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి , మరింత బలంగా ఎదగడానికి సహాయ పడేలా చేస్తాయని తెలిపారు రాహుల్ గాంధీ.