తెలంగాణలో 70 శాతం కుల గణన
పూర్తయిందన్న రాహుల్ గాంధీ
ఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేపై స్పందించారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆయన కుల గణన యుద్ద ప్రాతిపదికన కొనసాగుతోందన్నారు.
ఇప్పటి వరకు తనకు అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో 70 శాతానికి పైగా కుల గణన పూర్తయిందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. త్వరలో ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి సంబంధించిన వివరణాత్మక డేటాను కలిగి ఉంటుందన్నారు.
తాము విధానాలను రూపొందించడానికి, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడానికి ఈ వివరాలను ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు రాహుల్ గాంధీ.
కుల గణన అనేది రాబోయే కొన్ని దశాబ్దాల్లో సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక చేయడంలో సహాయపడే అనేక ముఖ్యమైన దశల్లో మొదటిదని వెల్లడించారు ఎంపీ.
దేశంలో సమగ్ర కుల గణన జరగాలని తాను పదే పదే డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ఇందులో భాగంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని , ఈ సందర్బంగా రాష్ట్ర సర్కార్ ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.