అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తాం
అధికారంలోకి వచ్చాక నిర్ణయం
బీహార్ – ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి రాహుల్ గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధాన మంత్రి మోడీని ఏకి పారేశారు. తను తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశం చాలా ఏళ్లు వెనక్కి వెళుతోందని ఆవేదన చెందారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రపంగించారు. దేశంలో ఇప్పటి వరకు 6 విడతల పోలింగ్ కొనసాగిందన్నారు. దీని వల్ల అదనపు ఖర్చు తప్ప ఇంకేమీ లేదన్నారు. మోడీ పదే పదే తాను పీఎంను అవుతానని అంటున్నాడని, కానీ ఎందుకని ఆయనను ప్రధానిగా ఎన్నుకోవాలో చెప్పాలన్నారు.
75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఏనాడూ ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరిగాయా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. మోడీ తీసుకు వచ్చిన అగ్ని వీర్ పథకాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
యువతను ఈ స్కీం పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడంటూ నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.