వైస్ఆర్ అరుదైన ప్రజా నేత
రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరుదైన ప్రజా నాయకుడు అని కితాబు ఇచ్చారు ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ. సోమవారం డాక్టర్ వైఎస్సార్ 75వ జయంతి. ఈ సందర్బంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మంగళగరి వేదికగా బహిరంగ సభను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిలా రెడ్డి ఉన్నారు.
ఆయన జయంతిని పురస్కరించుకుని రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఎల్లప్పుడూ ప్రజల కోసం బతికిన నాయకుడు వైఎస్సార్ అంటూ ప్రశంసించారు. ఆయన మరణం విషాదకరమని పేర్కొన్నారు.వైసీ గనుక బతికి ఉంటే ఏపీ రాష్ట్ర ముఖ చిత్రం వేరేగా ఉండేదన్నారు రాహుల్ గాంధీ.
ఏపీ అన్ని రంగాలలో ముందంజలో కొనసాగి ఉండేదని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ వారసత్వాన్ని వైఎస్ షర్మిలా రెడ్డి ముందుకు తీసుకు వెళుతుందని, ఆ నమ్మకం తనకు ఉందన్నారు. ఆమె నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో మరింత బల పడుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్ లో ఉన్న ధైర్యం, తెగువ పోరాడే తత్వాన్ని షర్మిలలో తాను చూశానని తెలిపారు.