NEWSNATIONAL

ఎల‌క్టోర‌ల్ బాండ్స్ బిగ్ స్కామ్

Share it with your family & friends

దీనికి నాయ‌కుడు మోదీనే

న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేశారు. సుప్రీంకోర్టు దెబ్బ‌కు బీజేపీ బండారం బ‌య‌ట ప‌డింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఎల‌క్టోర‌ల్ బాండ్స్ వ్య‌వ‌హారం దేశాన్ని ఒక్క‌సారిగా విస్తు పోయేలా చేసింది. 2014 నుంచి 2023 వ‌ర‌కు ఆయా పార్టీలు, వ్య‌క్తులు, సంస్థ‌లు గంప గుత్త‌గా తాము సంపాదించిన డ‌బ్బుల‌ను మోదీ ప‌రివారానికి విరాళాల రూపేణా అంద‌జేశారు.

అత్య‌ధికంగా వేల కోట్ల రూపాయ‌ల‌తో టాప్ లో నిలిచింది మోదీ బీజేపీ. యావ‌త్ భార‌త‌మంతా ఆశ్చ‌ర్యానికి లోనైంది. విరాళాలు ఇచ్చిన వారిలో అక్ర‌మార్కులే ఉన్నారు. ప్రాంతీయ పార్టీల ప‌రంగా చూస్తే కేసీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలిచింది. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్క‌టేన‌ని తేలి పోయింద‌ని అన్నారు ఈ సంద‌ర్బంగా రాహుల్ గాంధీ.

ఈ మొత్తం ఎల‌క్టోర‌ల్ బాండ్స్ వ్య‌వ‌హారం ప్ర‌పంచంలోనే అతి పెద్ద కుంభ‌కోణంగా అభివ‌ర్ణించారు. దీనికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారంటూ ఆరోపించారు. ఇక‌నైనా ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని సూచించారు రాహుల్ గాంధీ.