ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా
వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ
మహారాష్ట్ర – ప్రజల కోసం తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీప్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. గత కొన్ని నెలలుగా తాను చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ మహారాష్ట్రలో నిర్వహించారు. భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సందర్బంగా అశేష ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ.
ప్రపంచంలోనే అతి పెద్ద స్కాం ఏదైనా ఉందంటే మోదీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎలక్టోరల్ బాండ్స్ అని సంచలన ఆరోపణలు చేశారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు.
అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ దేశంలో ఉన్న వనరులను ప్రజలకు దక్కకుండా మోదీ ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. బడా బాబులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని తాకట్టు పెట్టేందుకు ఫోకస్ పెట్టాడని మండిపడ్డారు రాహుల్ గాంధీ.
భారత్ జోడో యాత్ర ఇవాల్టితో ముగియదని మరో రూపంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.