Sunday, April 20, 2025
HomeNEWSNATIONALగురువు..మార్గ‌ద‌ర్శిని కోల్పోయాను

గురువు..మార్గ‌ద‌ర్శిని కోల్పోయాను

ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

ఢిల్లీ – మాజీ పీఎం డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ మృతి ప‌ట్ల తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు రాయ్ బ‌రేలీ ఎంపీ రాహుల్ గాంధీ. భారతదేశాన్ని అపారమైన జ్ఞానం, సమగ్రతతో నడిపించారని కొనియాడారు. అత్యంత నిరాడంబ‌ర‌మైన శైలి, విన‌య విధేయ‌త‌లు త‌న‌ను ఆక‌ట్టుకున్నాయ‌ని తెలిపారు. అంతే కాదు ఆయ‌న‌కు అన్ని అంశాల ప‌ట్ల లోతైన అవ‌గాహ‌న ఉంద‌న్నారు. ప్ర‌త్యేకించి ఆర్థిక శాస్త్రంపై డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ కు మంచి ప‌ట్టుంద‌న్నారు.

ఒక ర‌కంగా త‌న‌కు గురువు, మార్గ‌ద‌ర్శిని కోల్పోయాన‌ని వాపోయారు రాహుల్ గాంధీ. ఆయ‌న‌ను అభిమానించే లక్ష‌లాది మంది త‌న‌ను ఎల్ల‌ప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ పార్టీకి, దేశానికి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ మృతి తీర‌ని లోటు అని పేర్కొన్నారు .

డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నాన‌ని, ఎక్కువ‌గా మాట్లాడ‌క పోవ‌డం, ఆచ‌ర‌ణాత్మ‌కంగా ఉండ‌డం గొప్ప‌నైన విష‌యాల‌ని పేర్కొన్నారు పీఎం న‌రేంద్ర మోడీ. భారతదేశం తన విశిష్ట నాయకులలో ఒకరైన మన్మోహన్ సింగ్ జీని కోల్పోవ‌డం త‌న‌ను మ‌రింత బాధ‌కు లోను చేసింద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments