దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలి
స్పష్టం చేసిన రాహుల్ గాంధీ
ఛండీగడ్ – ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ తనను ఎంతగా బీజేపీ, అనుబంధ సంస్థలు ఛీత్కరించినా, ఆరోపణలు చేసినా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే తొలిసారిగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది.
దేశ వ్యాప్తంగా రాహుల్ కు క్రేజ్ పెరిగింది. ఇదే సమయంలో తాజాగా ఆయన రెండో విడతగా భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా ఆయనను చిన్నారులు, మహిళలు, వృద్దులు కలుస్తున్నారు. వారు తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు.
న్యాయ్ యాత్ర సందర్బంగా ఓ చిన్నారి రాహుల్ గాంధీని కలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ బాలికను ఆప్యాయంగా పలకరించారు రాహుల్ గాంధీ. దీంతో ఆ పాప భావోద్వేగానికి లోనైంది. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలని స్పష్టం చేశారు. కులం పేరుతో, మతం పేరుతో మోసం చేయడం మానుకోవాలని , వీరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.