NEWSNATIONAL

ఎగ్జిట్ పోల్ కాదు మోడీ మీడియా పోల్

Share it with your family & friends

ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు సిట్టింగ్ ఎంపీ, రాయ్ బ‌రేలీ అభ్య‌ర్థి రాహుల్ గాంధీ సీరియ‌స్ అయ్యారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇవాళ జాతీయ సంస్థ‌ల‌న్నీ గంప గుత్త‌గా మోడీ మ‌రోసారి పీఎం కాబోతున్నార‌ని, బీజేపీకి 390కి పైగా సీట్లు వ‌స్తాయంటూ ఊద‌ర‌గొట్టారు. ఇంకా ప్ర‌చారం చేస్తూనే ఉన్నారు.

దీనిపై స్పందించారు రాహుల్ గాంధీ. ఇది ఎగ్జిట్ పోల్ కాద‌ని మోడీ మీడియా పోల్ అంటూ ఎద్దేవా చేశారు. ఇది ఆయ‌న ఫాంట‌సీ పోల్ అంటూ మండి ప‌డ్డారు రాహుల్ గాంధీ. ఈ సంద‌ర్బంగా మీ అంచ‌నా ఏమిటి అని ప్ర‌శ్నించిన మీడియాకు గ‌ట్టి స‌మాధానం ఇచ్చారు.

మీరు ఎప్పుడైనా పంజాబ్ దిగ్గ‌జ గాయ‌కుడు , దివంగ‌త సిద్దూ మూసే వాలా పాడిన భాంగ్రా సాంగ్ విన్నారా అని ప్ర‌శ్నించారు. వీలైతే నెట్టింట్లో టాప్ లో కొన‌సాగుతోంద‌ని, వినండి అంటూ హిత‌వు ప‌లికారు. త‌ను కాంగ్రెస్ పార్టీలో చేరిన నేత‌. దారుణ‌మైన హ‌త్య‌కు గుర‌య్యాడు. కానీ త‌ను పాడిన 295 పేరుతో పాడిన పాట అత్యంత పాపుల‌ర్ గా నిలిచింది. ఇప్ప‌టికీ ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. దీనినే ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు రాహుల్ గాంధీ.