ప్రజా సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం
2024 పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టో
తుక్కుగూడ – పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోను విడుదల చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేందుకు తాము మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోని తుక్కుగూడలో నిర్వహించిన జన జాతర సభలో మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణలో తాము ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందన్నారు. అప్పులకుప్పగా మార్చిందని ఆరోపించారు.
తెలంగాణలో వచ్చిన ఫలితాలే రేపు దేశ వ్యాప్తంగా రాబోతున్నాయని జోష్యం చెప్పారు రాహుల్ గాంధీ. రూ. 500లకే సిలిండర్ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, గృహ లక్ష్మి యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు.