డబ్బున్నోళ్లను గౌరవిస్తే తప్పేంటి..?
రాహుల్ గాంధీని ప్రశ్నించిన మోదీ
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఆయన ఇంకా రాజకీయ పరంగా ఎదగలేదని పేర్కొన్నారు. శుక్రవారం ప్రముఖ జర్నలిస్ట్ సుధీర్ చౌదరి తో మోదీ సంభాషించారు. ఈ సందర్బంగా రాహుల్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ కు అంత సీన్ లేదన్నారు. పొద్దస్తమానం పెట్టుబడి దారులను, పారిశ్రామికవేత్తలను తిడుతూ కూర్చుంటే ఎలా అని ఎదురు ప్రశ్న వేశారు.
ఆయన పదే పదే తాను కొద్ది మందికే లబ్ది చేకూరుస్తున్నానని ఆరోపణలు గుప్పిస్తూ నిరాదారమైన ఆరోపణలు చేస్తున్నాడని ఇది మంచి పద్దతి కాదన్నారు. తాను ఎవరికీ అనుకూలం లేదా వ్యతిరేకం కాదన్నారు.
ఇంతకూ రాహుల్ గాంధీ ఎవరు అంటూ ప్రశ్నించారు. ఆయనకు తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తాను ఈ దేశం కోసం కష్టపడుతున్నానని చెప్పారు. తనకు ఉండేందుకు ఇల్లు లేదని, కనీసం ప్రయాణం చేసేందుకు కారు కూడా లేదన్నారు. తన జీవితం మొత్తం దేశానికే అంకితం చేశానని అన్నారు మోదీ. అయితే డబ్బున్నోళ్లను గౌరవిస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు.