హిందూత్వం పేరుతో హింసోన్మాదం
లోక్ సభలో నిప్పులు చెరిగిన రాహుల్
న్యూఢిల్లీ – లోక్ సభలో ఇండియా కూటమి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం సభలో నిప్పులు చెరిగారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీజేపీ, ఎన్డీయే ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి సభ్యుల మధ్య మాటల యుద్దం కొనసాగింది. చివరకు ఒకరిపై మరొకరు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ హిందూయిజంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందూత్వం పేరుతో హింసోన్మాదం చెలరేగుతోందని, దీనికి ప్రధానంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ , ఏబీవీపీ కలిసికట్టుగా మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.
ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హిందూవులందరికీ ప్రాతినిధ్యం వహించదని స్పష్టం చేశారు. తమను తాము హిందువుగా చెప్పుకునే వారు హింస, ద్వేషం, అసత్యం గురించి మాత్రమే మాట్లాడతారంటూ నిప్పులు చెరిగారు రాహుల్ గాందీ. దీనిపై పీఎం అభ్యంతరం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా పిలవడం దారుణమన్నారు.