మణిపూర్ పై రాహుల్ గాంధీ కామెంట్స్
అదో అద్భుతమైన అందమైన రాష్ట్రం
మణిపూర్ – ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ , లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా బాధితులు దారి పొడవునా నిలబడి స్వాగతం పలికారు యువ నాయకుడికి. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను విన్నారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ.
అనంతరం మీడియాతో మాట్లాడారు. మణిపూర్ రాష్ట్రం గురించి లేనిపోని సమస్యలను సృష్టించేలా ప్రశ్నలు అడగడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఏదైనా ఉంటే నేరుగా తనను అడిగితే ఆన్సర్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
ప్రధానంగా సమస్యను దారి మళ్లించేందుకు రూపొందించిన ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఈ దేశంలో అత్యంత అద్బుతమైన, అందమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒక్క మణిపూర్ మాత్రమేనని స్పష్టం చేశారు.