కేంద్రం మోసం దేశం ఆగమాగం
ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
ఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోడీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం నిర్వాకం కారణంగా దేశం ఆగమాగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు , ఎంపీ రాహుల్ గాంధీ. సోమవారం సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్బంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ 2024 పూర్తిగా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు.
ఇది పూర్తిగా పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఉన్నోళ్లకు, పెట్టుబడిదారులకు మేలు చేకూర్చేలా బడ్జెట్ ను ప్రవేశ పెట్టారని ధ్వజమెత్తారు ఎంపీ.
ఈ దేశాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్పా మోదీ ఈ దేశానికి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు రాహుల్ గాంధీ. కమలం ఆకారంలో ఉన్న చక్ర వ్యూహం ఈ దేశాన్ని ట్రాప్ చేస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆరుగురి చేతుల్లో దేశం నడుస్తోందని ఆరోపించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ, అజిత్ దోవల్, మోహన్ భగవత్ కంట్రోల్ చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ.