కేంద్రం నియంతృత్వానికి నిదర్శనం
ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. రాజ్యాంగం పట్ల అగౌరవంగా మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఆందోళన చేపట్టారు.
అంతకు ముందు పార్లమెంట్ ముందు విపక్ష ఎంపీలతో కలిసి నిరసన నిర్వహించారు. బ్లూ కలర్ దుస్తుల్లో వచ్చి నిరసన తెలిపిన రాహుల్, ప్రియాంక గాంధీ. అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సేనంటూ బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు.
పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగికి గాయాలు అయ్యాయి..రాహుల్ ఒక ఎంపీని తోసేయడంతో, ఆయన తనపై పడటంతో గాయపడ్డానన్న ప్రతాప్ సారంగి.
ప్రతాప్ సారంగిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.. కాంగ్రెస్ ఎంపీలు గూండాగిరి చేస్తున్నారని బీజేపీ ఎంపీలు సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీలే కావాలని తమను పార్లమెంట్ కు వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.