జ్ఞాపశక్తి కోల్పోతున్న పీఎం మోడీ
రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్
ఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీని ఉద్దేశించి తనకు రోజు రోజుకు అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ లాగా జ్ఞాపశక్తిని కోల్పోతున్నారని అన్నారు . ఈ మధ్య మోడీ చేసిన ప్రకటనలు , మాట్లాడిన మాటలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
తాజాగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, కాషాయ దళాలు. రాజకీయ పరంగా దేశానికి సంబంధించిన నిర్ణయాలు, అంశాలపై మాట్లాడటంలో తప్పు లేదని అన్నారు.
కానీ మోడీని ఉద్దేశించి వ్యక్తిగతంగా చవకబారు ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి తగదని తీవ్ర స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.