అమిత్ షా..అదానీలే కింగ్ మేకర్స్
నరేంద్ర మోదీ పై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి మోదీ పేరుకు మాత్రమేనని దేశాన్ని నడిపించేదంతా ఆ ఇద్దరేనంటూ మండిపడ్డారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, గౌతమ్ అదానీలే దేశాన్ని ఏలుతున్నారంటూ ఆరోపించారు .
ఆనాడు రావణాసురుడు ఇద్దరి మాటలు వినేవాడని, ఒకరు మేఘనాథుడు అయితే మరొకరు కుంభ కర్ణుడని పేర్కొన్నారు. అలాగే ప్రధాని కూడా ఇద్దరి మాటలే వింటున్నాడని, వారెవరో కాదు ఒకరు షా ఇంకొకరు అదానీ అంటూ ఫైర్ అయ్యారు.
ఓ వైపు దేశంలో పేదరికం, ద్రవ్యోల్బణం పెరిగి పోతోందని, అపారమైన వనరులు పరుల పరం చేస్తున్నారని , ప్రజా సమస్యలను గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ. కార్పొరేట్ కంపెనీలు, బడా బాబులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు ధారదత్తం చేసేందుకు మాత్రమే ప్రధానిగా మోదీ ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.