బాండ్ల పేరుతో బీజేపీ మోసం
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఎలక్టోరల్ బాండ్ల పేరుతో మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ నిట్ట నిలువునా మోసం చేసిందని ఆరోపించారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. దేశమంతా న్యాయం కోసం ఒక్కటి అవుతుంటే బీజేపీ బాండ్లన్నింటినీ ఒక్కటి చేస్తోందన్నారు. అవినీతిని అంతం చేస్తామని అన్న నోళ్లే రాజకీయ స్వార్థాలకు అవినీతిని అందలం ఎక్కించారంటూ మండిపడ్డారు.
రాజకీయ స్వార్థాలకు అవినీతిని అందలం ఎక్కిస్తున్న వైనం దారుణమన్నారు. తాజాగా ఎన్నికల సంఘం బయట పెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు.. భాజపా అనుసరిస్తోన్న అవినీతి వ్యూహాలను స్పష్టంగా బహిర్గతం చేస్తున్నాయని పేర్కొన్నారు
అవినీతికి పాల్పడం, పాల్పడనివ్వం.. అనే ప్రధాని మోదీ, ఎన్నికల బాండ్ల పేరుతో భాజపా 6060 కోట్ల నిధులను ఎలా సేకరించారో చెప్పాల్పిన అవసరం ఉందన్నారు. మొత్తం విరాళాలలో భాజపానే ఏకంగా 50 శాతం విరాళాలు పొందడం ఒక ఎత్తయితే… విరాళాలు ఇచ్చిన వారిలో ఎక్కువగా ఈడీ, ఐటీల దాడులను ఎదుర్కొన్నవారే కావడం మరొక ఎత్తు అని ఎద్దేవా చేశారు .
ఇక నైనా తెలుసుకోండి… ఈ బీజేపి కుటిల రాజకీయాలు. అవినీతిని చేయనివ్వమని అన్నారు రాహుల్ గాంధీ.