సీఈసీ నిర్వాకం రాహుల్ ఆగ్రహం
ఎన్నికల నిర్వహణలో వైఫల్యం
ఉత్తర ప్రదేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒకే ఒక్క పార్టీకి వంత పాడుతున్నట్లుగా ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్బంగా చోటు చేసుకున్న సంఘటనలను ఆయన ప్రత్యేకంగా ఉదహరించారు. అసలు ఈసీ అన్నది ఈ దేశంలో ఉందా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ
ఇప్పటికైనా ఎన్నికలు సజావుగా , నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే దేశంలో ఎన్నికల నిర్వహణ పట్ల ఉన్న ఆ కాస్తా నమ్మకం పోతుందని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి యూపీలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఒకరు ఏకంగా ఎనిమిదిసార్లు ఓటు వేయడం, దానికి సంబంధించిన వీడియోను షేర్ చేయడాన్ని ప్రస్తావించారు రాహుల్ గాంధీ.
ఇకనైనా ఈసీ మారాలని ఇలాంటి చర్యలకు పుల్ స్టాప్ పెట్టాలని కోరారు. లేకపోతే దేశ వ్యాప్తంగా సీఈసీ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలతో కూడిన భారతీయ కూటమి ఆందోళన బాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.