NEWSNATIONAL

విద్వేషం రాజ్యం ఏలుతోంది

Share it with your family & friends

ఆవేద‌న చెందిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ దేశంలో ప్ర‌జ‌లు అన్ని రకాలుగా నిస్స‌హాయులుగా మారి పోయార‌ని ఇది దేశానికి అంత మంచిది కాద‌న్నారు. భార‌త్ జోడో న్యాయ్ యాత్ర సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు రాహుల్ గాంధీ.

ఎవ‌రు ఉన్నా లేకున్నా త‌మ యాత్ర కంటిన్యూగా కొన‌సాగుతూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నో అడ్డంకులు సృష్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని కానీ ప్ర‌జ‌లు త‌నను అక్కున చేర్చుకున్నార‌ని కొనియాడారు. మీరందిస్తున్న ప్రోత్సాహాన్ని మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు.

ప్ర‌త్యేకించి దేశంలోని మ‌హిళ‌లు , రైతులు, యువ‌త‌, కూలీల‌కు తీవ్రంగా అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న చెందారు రాహుల్ గాంధీ. రాబోయే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇలాగే ప‌ట్టించుకోక పోతే విద్వేషం రాజ్యం ఏలే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని హెచ్చ‌రించారు.

ఇప్ప‌టి నుంచి క‌ళ్లు తెర‌వాల‌ని , అన్యాయం, ద్వేషం , హింస మ‌ధ్య లింక్ ఉంద‌ని గుర్తించాల‌న్నారు రాహుల్గ ఆంధీ.